హైదరాబాద్: 28°C
వార్తలు

సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి భారీ ఆదాయం

TN తూత్తుకుడి జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. రూ.4.21 కోట్లకు పైగా నగదు వచ్చింది. 1,022 గ్రా. బంగారం, 22,292 గ్రా. వెండి, 1,447 నోట్లు విదేశీ కరెన్సీ వచ్చింది. ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, అధికారుల సమక్షంలో 100 మందికి పైగా సిబ్బంది ఈ కానుకల లెక్కించారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామివారికి కానుకలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.