హర్యానా-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని యమునా నగర్ హత్నీకుండ్ బ్యారేజీ ప్రాంతంలో భారత సైన్యం మాక్ డ్రిల్ చేస్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఆర్మీకి చెందిన మోటారు బోటు యమునా నది ఉద్ధృతికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు గల్లంతయ్యారు. మరో ముగ్గురు సైనికులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. దీంతో గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు.
వార్తలు
ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు


