మహారాష్ట్ర లాతూర్‌లో టమోటా రైతుల చేత కంటతడి పెట్టిస్తోంది. అప్పులు చేసి, ట్యాంకర్లతో నీళ్లు కొనుగోలు చేసి పంటను కాపాడుకున్నా మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రే టమోటా ధర రూ.100 పలకడంతో కూలీలు, రవాణా ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను రోడ్డుపై పారబోసి రైతు కన్నీరుమున్నీరయ్యాడు.
వార్తలు
కంటతడి పెట్టిస్తోన్న టమోటా ధర


