నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆకస్మిక వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు ఆయన కాఠ్మాండు చేరుకున్నారు. బాధితులకు ఆహార పదార్థాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లలతో సమయం గడిపిన సోనూసూద్ వారికి ధైర్యం చెప్పారు. కాగా వరదల కారణంగా ఇప్పటి వరకు 1,127 మంది మరణించారు. మరో 4 వేల మందికిపైగా గల్లంతయ్యారు.
వార్తలు
నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ అండ


