హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీ ఎన్నికలు.. వారికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్?

వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల్లో ప్రజాదరణ, గెలుపు అవకాశాలు, ప్రచారానికి అవసరమైన వనరులు ఉన్న నేతలకే సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు చెప్పింది. మరోవైపు పొత్తులో భాగంగా 115 నుంచి 120 స్థానాల్లో పోటీలో నిలబడేందుకు ఎస్పీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.