హైదరాబాద్: 28°C
వార్తలు

మునిగిన యూపీ.. నలుగురు మృతి

యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అవధ్‌లో కురిసిన వానలకు నలుగురు మృతి చెందారు. వరదల కారణంగాలు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో రహదారులు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా థర్మల్ పవర్ ప్లాంట్లు బంద్ కావడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరాపై ప్రభావం పడింది. అలాగే 21 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.