ఉత్తరాఖండ్‌లో కురుసున్న భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అలాగే మట్టిదిబ్బలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా 172కుపైగా రహదారులు మూతపడ్డాయి. వరదల కారణంగా గౌలా, కోసి, క్షిప్రా, బిన్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి


