హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ ఢీకొని యువకుడు మృతి

SKLM: నరసన్నపేట మండలం ఉర్లాం పంచాయతీ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పప్పు దండసేన (19) మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.