హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లగుప్పలో పరిస్థితి అదుపులో ఉంది: కలెక్టర్

ASR: ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో 54 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో లక్ష్మీపురం, భద్రాచలం ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందుతోందని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఒక బాలిక మృతి చెందగా, మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.