హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీగా పెరిగిన నిమ్మ ధరలు..!

 ప్రకాశం: నిమ్మధరలు భగ్గుమంటున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో గత మంగళవారం 80 కేజీల బస్తా ధర రూ. 12వేల వరకు పలకగా ప్రస్తుతం రూ.16వేలకు చేరింది. వారం రోజుల్లోనే ఏకంగా రూ. 4వేలు ఎగబాకింది. కేజీ రూ. 200 వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం, వర్షాలు లేకపోవడంతో పాటు శ్రావణమాసం నేపథ్యంలో డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.