KRNL: మండలంలోని నార్లాపురం బ్రిడ్జి కింద సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బ్రిడ్జిపై నుంచి పడటంతో నడుము, కుడి మోకాలు విరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు. వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై నరేశ్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని మృతదేహం లభ్యం


