హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకు అభివృద్ధికి నిధులు కేటాయించండి: ఎమ్మెల్యే

W.G: తణుకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబుతో కొద్దిసేపు భేటీ అయిన రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.