హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. పంచాయితీ, గ్రామీణం, రోడ్లు, విద్య తదితర వాటిపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరు కావాలన్నారు.