హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెంటాలలో ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణ

PLD: మహనీయుల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ కృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. రెంటచింతల మండలం రెంటాలలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిచెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని, ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని ఎంపీ కొనియాడారు.