E.G: పాయకరావుపేటలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు 'జలహారతి' కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో గోకవరం బస్ డిపో నుంచి కొన్ని బస్సులను పంపినట్లు డిపో మేనేజర్ ఎం.అజయ్ బాబు తెలిపారు. దీంతో కొన్ని సర్వీసులను తగ్గించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. రాజమహేంద్రవరం, రంపచోడవరం, అడ్డతీగల వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు అలర్ట్


