హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో ఘనంగా 70వ బీమా వారోత్సవాలు

KDP: ప్రతి భారతీయ కుటుంబానికి ఎల్‌ఐసీ నమ్మకమైన నేస్తమని డీఆర్డీఏ పీడీ డా. జి. రాజ్యలక్ష్మి అన్నారు. కడప ఎల్‌ఐసీ కార్యాలయంలో 70వ బీమా వారోత్సవాలను ప్రారంభించారు. ఎల్‌ఐసీ 70 ఏళ్లుగా దేశ ఆర్థికాభివృద్ధికి సేవలందిస్తోందన్నారు. పాలసీదారులు ‘My LIC’ యాప్ ద్వారా సేవలు పొందాలని సీనియర్ డివిజనల్ మేనేజర్ దుర్గాప్రసాద్ సూచించారు.