తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. రామనాథపురం జిల్లా ఉచ్చిపుళి సమీపంలోని ఓ యువతికి వివాహం జరగాల్సి ఉండగా, మాజీ ప్రియుడు ఆమెతో ఉన్న వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న మాజీ ప్రియుడి కోసం గాలిస్తున్నారు.
వార్తలు
ఫొటోలు సోషల్ మీడియాలో.. పెళ్లి రద్దు


