హైదరాబాద్: 28°C
వార్తలు

'పిల్లల ఇష్టం ఒక్కటే కస్టడీకి ప్రామాణికం కాదు'

పిల్లల కస్టడీ కేసుల్లో వారి ఇష్టాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోలేమని మధ్యప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. చిన్నారి సమగ్ర సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. మానసిక, శారీరక ఎదుగుదల, విద్య, సురక్షిత వాతావరణం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. తల్లిదండ్రుల ప్రభావంతో పిల్లల అభిప్రాయాలు మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.