TG: ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సత్యదూరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పనుల పురోగతిని పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.17.50 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.16.47 కోట్లు వినియోగించినట్లు స్పష్టం చేశారు.
వార్తలు
అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్


