హైదరాబాద్: 28°C
వార్తలు

నైనీ బొగ్గు రవాణా ప్రారంభం.. యాదాద్రికి తొలి రేక్‌

TG: ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి 4వేల టన్నుల బొగ్గుతో తొలి రేక్‌ యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు చేరుకుంది. సుమారు 1,050కిలోమీటర్లు ప్రయాణించి దామరచర్లకు చేరిన రేక్‌లో అధిక ఉష్ణ సామర్థ్యం కలిగిన నాణ్యమైన బొగ్గు ఉంది. దీంతో బూడిద సమస్యలు తగ్గి విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెరిగుతుంది. TGGENCO, సింగరేణి, రైల్వేల సమన్వయంతో రవాణా జరిగింది.