హైదరాబాద్: 28°C
వార్తలు

పెరిగిన చక్కెర ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా చక్కెర ధరలు పెరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్దే ఉండే గరిష్ట చక్కెర నిల్వల పరిమితిపై కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు ఉన్న 4000 క్వింటాళ్ల నిల్వ పరిమితిని సగానికి తగ్గించింది. అలాగే వ్యాపారులు కొనుగోలు చేసిన చక్కెర నిల్వలను 30 రోజులకు మించి తమ వద్ద ఉంచుకోరాదని తెలిపింది. ఈ నెల 15 నుంచి NOV 30 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పింది.