కోనసీమ: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారి ఆలయంలో 80 రోజులకు గాను హుండీల ద్వారా వచ్చిన రూ.51,14,420 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ఎం.రాంబాబు రెడ్డి తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి రామలింగేశ్వర రావు పర్యవేక్షణలో మంగళవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. 22 గ్రాముల బంగారం, 390 గ్రాముల వెండి కూడా లభించాయన్నారు.
వార్తలు
బాల బాలాజీ హుండీ ఆదాయం రూ.51.14 లక్షలు


