హైదరాబాద్: 28°C
వార్తలు

లారీలో మంటలు.. 30కిపైగా ఫ్రిజ్‌లు దగ్ధం

కేరళలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్‌లతో వెళ్తున్న కంటైనర్‌ లారీకి కాసర్‌గోడ్‌లో విద్యుత్‌ తీగలు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కంటైనర్‌లోని 30కి పైగా ఫ్రిజ్‌లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.