హైదరాబాద్: 28°C
వార్తలు

బావిలో పడిన 75 ఏళ్ల వృద్ధురాలు.. సురక్షితం

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ప్రమాదవశాత్తు 75 ఏళ్ల వృద్ధురాలు బావిలో పడింది. ఆమె తన కొడుకు ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజుల పాటు ఆ వృద్ధురాలు బావిలోనే బిక్కుబిక్కుమంటూ జీవించింది. ఆహారం, నీరు లేకుండా ప్రాణాలతో పోరాటం చేసింది. చివరకు ఆమెను స్థానికులు గుర్తించగా.. రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని బామ్మను బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు.