హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీం తీర్పుతో నిజమైన న్యాయం జరిగింది: దీప్కే

నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను రద్దు చేయడంపై సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించడంతో వారి తల్లిదండ్రుల కడుపుకోతకు పూర్తి న్యాయం చేకూరిందని తెలిపారు.