హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీం ఆదేశాలపై కేంద్రమంత్రి హర్షం

నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన FIRలను సుప్రీంకోర్టు రద్దు చేయటంపై కేంద్రమంత్రి జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిరసనల సమయంలో కేంద్రం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చించి కేసుల ఎత్తివేతకు మార్గం సుగమం చేసినట్లు వెల్లడించారు.