హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రికి బెదిరింపు లేఖ

కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. చిరాగ్‌ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు లేఖ పంపారు. ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురవుతారంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ లేఖను హోంశాఖ కార్యదర్శికి చిరాగ్ సిబ్బంది పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లేఖను ఎవరు పంపారు అన్న కోణంలో విచారిస్తున్నారు.