హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పాఠశాల భవనం నిర్మించండి సారు..!

ASR: జీకేవీధి మండలం గొర్రిలోవ ప్రభుత్వ పాఠశాలకు పదేళ్లుగా భవనం లేక విద్యార్థులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దుప్పులవాడ పంచాయతీలోని ఈ పాఠశాలలో చింతగుప్ప, పులిగుప్ప, కొత్తూరుకోట, కొత్తపాకలు గ్రామాలకు చెందిన 90 మంది చదువుకుంటున్నారు. భవనం లేక పాత ఇంటి వరండాలోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు.