హైదరాబాద్: 28°C
తెలంగాణ

పసికందు మృతి.. వైద్యం నిర్లక్ష్యంపై ఆరోపణలు

SRD: కంగ్టి మండలం రసూల్ గ్రామంలో 20 రోజుల పసికందు మృతి చెందడంతో విషాదం నెలకొంది. జ్వరం రావడంతో సోమవారం తడ్కల్‌లో ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించినా తగ్గలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాబు మృతి చెందాడు. ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు.