హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో హైదరాబాద్‌.. భారీగా తరలివచ్చిన టీచర్లు

VKB: పరిగి, బొంరాస్‌పేట్‌ మండలాల PRTU-TS శాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన ‘చలో హైదరాబాద్‌’ ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీ మేరకు CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని కోరారు.