హైదరాబాద్: 28°C
తెలంగాణ

హంటర్‌ రోడ్డులో ట్రాఫిక్‌ కట్టడికి కీలక నిర్ణయం

హనుమకొండ హంటర్‌ రోడ్డులో ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలను తగ్గించడంతో పాటు విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు WGL CP శ్వేత అన్నారు. ఇవాళ అదాలత్ జంక్షన్‌ నుంచి నీలిమ జంక్షన్‌ వరకు ప్రమాదకరమైన స్థలాలను CP, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న పరిశీలించారు. న్యూ సైన్స్‌ కాలేజీ సమీపంలోని మీడియన్‌ కటింగ్‌ను ప్రయోగాత్మకంగా తాత్కాలికంగా మూసివేయాలన్నారు.