హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి: ఏబీవీపీ

MBNR: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జడ్చర్ల అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. 4.5 లక్షల మంది విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు విమర్శించారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల నుంచి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదన్నారు.