SRD: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కోహిర్ మండలం దిగ్వాల్ ప్రాథమిక కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక వైద్యులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఓపి, ఐపీ, మందుల స్టోరేజ్, లేబర్ రూమ్, ల్యాబ్ పరిశీలించారు.
తెలంగాణ
మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO


