హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి

SDPT: మద్దూర్ మండలం గాగిల్లాపూర్‌కు చెందిన రైతు కుక్కల రవి పాడి గేదె మంగళవారం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. లక్షా పది వేలు వెచ్చించి కొనుగోలు చేసిన గేదె చనిపోవడంతో జీవనోపాధి కోల్పోయి ఆ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం ఈ నిరుపేద రైతు కుటుంబాన్ని ఆర్థిక ఆదుకోవాలని కోరారు.