హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా కోసం రైతుల పడిగాపులు

BHNG: యూరియా బుక్‌ చేసుకున్న రైతులు ఎరువులు తీసుకునేందుకు పాముకుంట కేంద్రానికి వచ్చి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్‌ చేసుకున్న రైతులు మంగళవారం కేంద్రానికి చేరుకున్నారు. మూడు గంటలు గడిచినా అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే అధికారులు స్పందించాలన్నారు.