హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సు హత్యాచారంపై నెటిజన్ల ఆగ్రహం

HYD: నర్సుపై జరిగిన దారుణ హత్యాచార ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా చర్యలు లేకపోవడం, గ్రిల్స్ లేని గదులను సిబ్బందికి కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో అక్రమ షాపుల నిర్వహణపైనా మండిపడుతూ, మహిళల భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.