హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టేషన్ ఘనపూర్ USFI మండల కమిటీ ఎన్నిక

JN: స్టేషన్ ఘనపూర్‌లో ఇవాళ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (USFI) జిల్లా కార్యదర్శి యాకన్న రాథోడ్ ఆధ్వర్యంలో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చరణ్‌ను, ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌రామ్‌, ఉపాధ్యక్షుడిగా భూక్య లోకేష్‌, సహాయ కార్యదర్శిగా బిందును ఎన్నుకున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపింది.