హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామచంద్రరావు అరెస్టు దుర్మార్గం: రాగి రాములు.

MDK: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్రమ అరెస్టు, నల్గొండ జిల్లా అధ్యక్షుడిపై దాడిని పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు తీవ్రంగా ఖండించారు. రామాయంపేట విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కడం నిరంకుశత్వమేనన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.