హైదరాబాద్: 28°C
తెలంగాణ

1000 రోజుల పాలన.. ఏవి పూర్తి? ఏవి బాకీ?

HYD: తెలంగాణలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనలో పథకాల అమలుపై చర్చ సాగుతోంది. ఫ్రీ బస్సు, రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విజయవంతమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే మహిళలకు నెలకు రూ.2,500, చేయూత పెన్షన్ల పెంపు, ఎకరానికి రూ.15,000 రైతు భరోసా వంటి హామీలు అమలు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.