SRPT: నడిగూడెంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం భోజన విరామ సమయంలో అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీధర్, కృష్ణ, ఈశ్వర్, నాగరాజు, రజిత, మదారు, వీరన్న, శ్రీనివాసు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాత పెన్షన్ కోసం అధ్యాపకుల నిరసన


