హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సూచిక బోర్డు ఏర్పాటు చేయండి సారు..

NZB: సిరికొండ న్యావనంది చౌరస్తాకు వెళ్లే రహదారిలో ప్రమాదకరమైన మలుపు ఉన్నప్పటికీ, అక్కడ మలుపు సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో మలుపు గుర్తించలేక ఓ కారు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన జరిగింది. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి మలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.