హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంపు

JGL: జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని ఈనెల 5 వరకు పంపిణీ చేసేందుకు గడువు పెంచిందని పెగడపల్లి మండల తహసీల్దార్ నిజాముద్దీన్ తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యం పంపిణీ గత నెల31 వరకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ప్రస్తుతం ఈనెల 5 వరకు గడువు పెంచినట్లు పేర్కొన్నారు.