హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఉద్యోగి పదవీ విరమణ కార్యక్రమం

SRD: కృష్ణారెడ్డిపేటలో TGSPDCL విద్యుత్ సంస్థ ఉద్యోగి కృష్ణ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘకాలం ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగిని ఈ సందర్భంగా అధికారులు, సహచర ఉద్యోగులు, స్థానికులు ఘనంగా సన్మానించారు. ఆయన అందించిన సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు.