MNCL: నస్పూర్‌లోని సీసీసీ కార్నర్‌లో మంగళవారం జీఓ 97 రద్దు చేయాలని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి జీఓకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మంచిర్యాల ఎసీపీ ప్రకాష్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడడంతో ఆందోళన విరమించారు.
తెలంగాణ
VIDEO: జీఓ 97 రద్దు చేయాలని విద్యార్థుల రాస్తారోకో


