GDWL: అలంపూర్‌లోని వర్షాకాలం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో అక్బర్‌పేట కాలనీలో డప్పు చప్పుళ్ల మధ్య సంప్రదాయ పద్ధతిలో లింగమయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుతూ పూజలు చేసినట్లు రైతులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: వానల కోసం అన్నదాతల ప్రత్యేక పూజలు


