MDK: రామాయంపేట మండలం తొనిగండ్ల జీపీ కార్యాలయంలో సర్పంచ్ శివకుమారి నాగులు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి మౌనిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 2027-28 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఉపాధి హామీ పథకం వార్షిక ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పలు పనులను ప్రతిపాదించి, వాటిని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు.
తెలంగాణ
ఉపాధి హామీ ప్రణాళికపై గ్రామసభ


