హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చైతన్యం తీసుకురావడం అవసరం'

MNCL: సీజనల్ వ్యాధులపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డా.ఉమాశ్రీ సూచించారు. శనివారం మధ్యాహ్నం జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు మందులను ఇవ్వాలన్నారు.