హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

MBNR: మిడ్జిల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. ఆవరణలో మురుగునీరు నిల్వకుండా డ్రైనేజీ పనులు చేపట్టాలని, పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. GCDO అస్రా ఫాతిమా, MPDO లక్ష్మణ్, SO కవిత పాల్గొన్నారు.