MLG: ములుగు (M) అబ్బాపూర్ గ్రామంలో వృద్ధ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం జీవింతరావుపల్లి వై జంక్షన్ వద్ద సిరిగిరి ప్రసాద్, పండుగ రమేష్, గుంజ గంగాధర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి రవీందర్ తెలిపారు. వారి నుంచి 4.280 తులాల బంగారం, రెండు బైకులు, ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
తెలంగాణ
వృద్ధురాలి పుస్తెలతాడు చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్


