హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్‌ సమస్యపై పండ్ల వ్యాపారులకు కౌన్సెలింగ్‌

PDPL: పెద్దపల్లి బస్టాండ్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో పండ్ల దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహించారు. వ్యాపారులు రోడ్లపైకి దుకాణాలను విస్తరించడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇరువర్గాలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దుకాణదారులకు అవగాహన కల్పించి, వారి షాపులను సరిచేశారు.